Home  »  TV News  »  Jayam serial : శకుంతల షష్టిపూర్తి వేడుకలో ఊహించని ట్విస్ట్.. వీరుకి షాక్ ఇచ్చిన రుద్ర!

Updated : May 9, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -264 లో...రేపు మీ వియ్యంకుడి షష్టిపూర్తికి నువ్వు మీ ఆవిడా వెళ్లికి వెళ్ళండి అని పైడిరాజుకి విశ్వ పర్మిషన్ ఇస్తాడు. దాంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం సుధా నువ్వు వెళ్తావా అని విశ్వ అడుగుతాడు. వాళ్ళు మనల్ని ఎందుకు పిలుస్తారు అండి.. ఒకవేళ పిలిచినా మీరు ఎందుకు పంపిస్తారని సుధా అంటుంది. అసలు పంపించనని విశ్వ అంటాడు. రేపు నువ్వు నాతో అకాడమికి రా ని విశ్వ అంటాడు. నేను ఎందుకు రేపు గుడిలో కుంకుమ పూజ ఉందని సుధా అంటుంది. సరే అని విశ్వ అంటాడు. మరొకవైపు ప్రమీలకి కార్తీక్ చీర ఇస్తాడు. తను కోపంగా చూస్తుంది. దాంతో మక్కమ్ వచ్చి మేడమ్ స్టాప్ .. అందరం కొన్నాం అని మక్కమ్ కవర్ చేస్తాడు. థాంక్స్ అని ప్రమీల తీసుకుంటుంది. మరుసటి రోజు షష్ఠిపూర్తికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని వీరు చేస్తాడు.

మరొకవైపు శకుంతలని పెళ్లి కూతురులాగా ముస్తాబు చేస్తారు. పెద్దమ్మ ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఎలా ఉండేదోనని స్నేహ అంటుంది. చాళ్ళే గాని వెళ్లి పెద్ద నాన్న రెడీ అయ్యాడో లేదో చూడమని శకుంతల అంటుంది. ఆ తర్వాత రుద్ర దగ్గరికి రంగా వచ్చి మాట్లాడతాడు. అప్పుడే ఇందుమతి వచ్చి వీడియో తీస్తు.. తన ఫ్యాన్స్ కి ఇంట్లో వాళ్ళని చూపిస్తుంది. ఆ తర్వాత ఇషిక వచ్చి ఏర్పాట్లు బాగా చేసావ్ బ్రో.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు అని ఇషిక అంటుంది. దాంతో వీరు కోపంగా చూస్తాడు. అంటే డబ్బు నీది కాదు కదా అని ఇషిక అంటుంది‌ కాకుంటే ఏర్పాట్లు చెయ్యడం కష్టమే కదా అని వీరు అంటాడు. మనం అనుకున్నది జరిగే వరకు ఇలాగే ఉండాలని వీరు అంటాడు.

ఆ తర్వాత రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది. ఏంటి తిన్నగా రాలేవా అని గంగని రుద్ర కోప్పడతాడు. మనం షష్టిపూర్తికి ఎలా ఉంటామోనని ఉహించుకుంటున్నానని గంగ అనగానే నిన్ను ఇలా వదిలేస్తే వచ్చే జన్మలో కూడా ఊహించుకుంటావని రుద్ర అంటాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ స్టాఫ్ ఫంక్షన్ కి వస్తారు. ఎందుకు పిలిచావని ప్రమీలతో వీరు అంటాడు. వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కదా అని ప్రమీల అంటుంది. ఇక కార్తీక్ ఇచ్చిన చీర కట్టుకొని, అతను ఇచ్చిన గాజులు వేసుకుంటుంది ప్రమీల‌. దాంతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వీరు నీకు మా అత్తయ్య గురించి తెలుసా.. తెలుసుకునే ప్రయత్నం చేస్తావ్ కదా.. ఆ శ్రమ వద్దు మా పెద్దనాన్న తన చెల్లి ఈ ఫంక్షన్ కి రావాలనుకుంటాన్నాడు వస్తుంది కూడా అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.